Thu Mar 26 2026 16:21:40 GMT+0530 (India Standard Time)
ఫ్యామిలీ సూసైడ్ కేసులో వీడిన మిస్టరీ
సంచలనం రేపిన ఫ్యామిలీ రేపిన స్యూసైడ్ కేసులో మిస్టరీ వీడింది

సంచలనం రేపిన ఫ్యామిలీ రేపిన స్యూసైడ్ కేసులో మిస్టరీ వీడింది. సాంకేతిక ఆధారాలను కూడా సేకరించారు. గత నెల 31వ తేదీన విజయారెడ్డి తన ఇద్దరు పిపిల్లలతో కలసి చర్లపల్లి రైల్వే స్టేషన్ కు సమీపంలో ట్రాక్ పై బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. అయితే విజయారెడ్డి గత కొంత కాలంగా డిప్రెషన్ లో ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది.
మానసిక వత్తిడితోనే...
ఎదిగి వచ్చిన ఇద్దరు పిల్లలను ఎలా ఒప్పించి బలవన్మరణానికి పాల్పడ్డారన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించారు. విజయారెడ్డి మానసిక వత్తిడికి గల కారణాలేంటన్న దానిపై ప్రస్తుతం విచారణ సాగుతుంది. గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న విచారణ విజయారెడ్డి కాల్ డేటాతో పాటు ల్యాప్ ట్యాప్ ను కూడా స్వాధీనం చేసుకుని చివరకు మానసిక వత్తిడి కారణంగానే ఈ బలవన్మరణానికి కారణమని పోలీసులు దాదాపుగా నిర్ధారించారు.
Next Story

