Tue Mar 10 2026 10:23:58 GMT+0530 (India Standard Time)
డాక్టర్ దీపిక మృతి కేసులో వీడిన మిస్టరీ
విజయవాడ డాక్టర్ దీపిక మృతి కేసులో మిస్టరీ వీడింది.

విజయవాడ డాక్టర్ దీపిక మృతి కేసులో మిస్టరీ వీడింది. దీపిక బలవన్మరణానికి కారణమైన డాక్టర్ అమర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ అమర్ దీపికను ప్రేమించి మరోయువతితో పెళ్లికి సిద్ధమవ్వడంతో దీపిక మనస్తాపానికి గురయిందని పోలీసులు చెబుతున్నారు. అనంతపురం మెడికల్ కాలేజీలో చదువుతూ విజయవాడ జీజీహెచ్‌లో వైద్యురాలిగా దీపిక విధులు నిర్వహిస్తున్నారు.
ప్రేమించి పెళ్లికి అంగీకరించకపోవడంతో...
డాక్టర్ దీపిక గత నెల 5వ తేదీన ప్రమాదకర ఇంజెక్షన్ చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే దీపిక మృతిపై ఆమె సోదరి, కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీపిక మరణానికి కారణాలను తెలుసుకోవాలని వారు కోరారు. బలవన్మరణానికి ముందు అమర్‌తో మాట్లాడిన డాక్టర్ దీపిక తర్వాత ఇంజెక్షన్ ను తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో పెళ్లికి అంగీకరించకపోవడంతోనే మనస్తాపానికి గురై దీపిక బలవన్మరణానికి కారణమని పోలీసులు తేల్చారు.
Next Story

