Mon Dec 08 2025 12:03:59 GMT+0000 (Coordinated Universal Time)
Saroornagar Murder Case : భర్తను డంబుల్స్ తో మోదీ.. తర్వాత గొంతు నులిమి హత్య చేసి.. ఇద్దరు పిల్లల తల్లి
హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో ఒక భార్య భర్తను హత మార్చడం సంచలనం కలిగించింది.

మేఘాలయలో హనీమూన్ మర్డర్ తర్వాత దేశంలో వరసగా భర్తలను చంపుతున్న భార్యల కేసులు పెరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వీటి సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. ఇటీవల కాలంలో తమ వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నాడని భావించి భార్యలు తమ ప్రియుడితో కలసి భర్తను లేపేస్తున్న ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో ఒక భార్య భర్తను హత మార్చడం సంచలనం కలిగించింది. హత్య చేసిన తర్వాత తన భర్త కళ్లు తిరిగి పడిపోయాడని పోలీసులకు ఫోన్ చేయడం కూడా అంతే ఆశ్చర్యం కలిగించింది. ఈ కేసులో సరూర్ నగర్ పోలీసులు భార్యతో పాటు ప్రియుడిని కూడా అరెస్ట్ చేశారు.
ఇద్దరు పిల్లల తల్లి...
పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. చిట్టి, శేఖర్ లు భార్యాభర్తలు, వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే శేఖర్ వయసు నలభై సంవత్సరాలు. కానీ చిట్టికి కొంత కాలం క్రితం హరీష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసిన భర్త శేఖర్ చిట్టిని గట్టిగా మందలించాడు. అయితే చిట్టి మాత్రం తమ మధ్య వివాహేతర సంబంధం అంటూ ఏమీ లేదని, కేవలం పరిచయం అని చెప్పి సర్దిచెప్పాలని చూసింది. కానీ శేఖర్ మాత్రం చిట్టిని గట్టిగా మందలించడంతో భర్త శేఖర్ ను లేపేయాలని చిట్టి ప్లాన్ వేసింది. తన ప్రియుడు హరీష్ తో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నింది. భర్త శేఖర్ రాత్రి నిద్రిస్తున్న సమయంలో చిట్టి డంబెల్ తో మోదగా, హరీష్ శేఖర్ గొంతు నులిమేశాడు.
వివాహేతర సంబంధమే...
పిల్లలు ఇంట్లో లేని సమయంలో ప్రియుడు హరీష్ కు ఫోన్ చేసి రావాలని చెప్పింది చిట్టి. శేఖర్ కొంత ప్రతిఘటించినా బలంగా గొంతు నొక్కడంతో మరణించాడని పోలీసులు తెలిపారు. అయితే భర్త శేఖర్ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత భార్య 100 కు డయల్ చేసి తన భర్త రాత్రి ఎవరితోనో గొడవపడి వచ్చి నిద్రపోయాడని, ఉదయం చూస్తే చనిపోయి ఉన్నాడని చెప్పింది. వారు వచ్చి చూస్తే చనిపోయి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. చిట్టిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా నేరం అంగీకరించింది. దీంతో భార్య చిట్టి, ప్రియుడు హరీష్ లను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
Next Story

