Mon Sep 09 2024 11:46:39 GMT+0000 (Coordinated Universal Time)
దండుపాళ్యం సినిమా చూసి దోపిడీ, హత్య
కదిరి లో సంచలనం సృష్టించిన ఉపాధ్యాయురాలి హత్య కేసు మిస్టరీని వీడింది.
ఒక సినిమా చూసి దానిద్వారా ఒక దోపిడీకి పాల్పడ్డాడు కరడు గట్టిన నేరగాడు. కదిరి లో దారిదోపిడిలో అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కదిరి లో సంచలనం సృష్టించిన ఉపాధ్యాయురాలి హత్య కేసు మిస్టరీని వీడింది. మూడు నెలల పరిశోధన తర్వాత ఈ హత్య కేసులో అసలు నేరగాడు దొరికాడు. ఇందుకోసం ఎనిమిది పోలీసు ప్రత్యేక బృందాలు ఐదు రాష్ట్రాల్లో గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఎట్టకేలకు నిందితుడిని....
ఉపాధ్యాయురాలి హత్య కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఐదు వేల మంది అనుమానితులను విచారించారు. వేల సంఖ్యలో ఫోన్ కాల్స్ ను పరిశీలించారు. ఈ నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. అతని నుంచి 58 తులాల బంగారం, 97 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితుడు ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఏడు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
Next Story