Fri Dec 05 2025 11:10:33 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ముంబై పేలుళ్ల బెదిరింపు : నోయిడాలో వ్యక్తి అరెస్ట్
ముంబైలో ఉగ్రదాడులు జరగనున్నాయని తప్పుడు మెసేజ్ పంపిన వ్యక్తిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

ముంబైలో ఉగ్రదాడులు జరగనున్నాయని తప్పుడు మెసేజ్ పంపిన వ్యక్తిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నోయిడాలో ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన అశ్వినికుమార్ సుప్రా అనే వ్యక్తిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేవలం గంటల్లోనే పట్టుకున్నారు. అతని వయసు యాభై ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు.
నోయిడాలోని...
నోయిడాలోని సెక్టార్–79లోని అతని నివాసం నుంచి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. గురువారం ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబరుకు వచ్చిన మెసేజ్ లో, 14 మంది ఉగ్రవాదులు మానవ బాంబులతో పాటు 400 కిలోల ఆర్డిఎక్స్తో ముంబైలోకి ప్రవేశించారని, నగరాన్ని పేల్చేందుకు 34 వాహనాల్లో బాంబులు పెట్టారని పేర్కొన్నాడు. దీంతో విచారణ జరిపిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story

