Mon Sep 09 2024 12:50:18 GMT+0000 (Coordinated Universal Time)
చుల్ బుల్ పాండేను స్పాలో అతి దారుణంగా చంపేశారు
అతని స్నేహితురాలి ద్వారా లోపలి వెళ్ళాడు చుల్బుల్ పాండే
ముంబైలో చుల్ బుల్ పాండేను అతి దారుణంగా చంపేశారు. వర్లీలోని స్పాలో 50 ఏళ్ల వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. వర్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుసిద్ధప్ప వాఘ్మారే అలియాస్ చుల్బుల్ పాండే తన స్నేహితురాలితో కలిసి సియోన్ రైల్వే స్టేషన్ సమీపంలోని అపర్ణా బార్ & రెస్టారెంట్లో డ్రింక్స్ తాగి వర్లీ నాకా సమీపంలోని సాఫ్ట్ టచ్ స్పాకు వెళ్లాడు. స్పా గత ఆరు నెలలుగా మూసివేసి ఉంచారు. అయితే దాని యజమానికి సన్నిహితంగా ఉండే అతని స్నేహితురాలి ద్వారా లోపలి వెళ్ళాడు చుల్బుల్ పాండే. ఇద్దరూ స్పా లోపల ఉన్నప్పుడు, ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు లోపలి చొరబడి పదునైన ఆయుధాలతో పదేపదే దాడి చేసి హతమార్చారు. అతడు చనిపోయాడని తెలిసినా కూడా ముక్కలు ముక్కలుగా నరికారు.
చుల్ బుల్ పాండే పై విలే పార్లే పోలీస్ స్టేషన్లో కనీసం ఐదు క్రిమినల్ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నిందితులను పట్టుకునేందుకు సీనియర్ పోలీసు అధికారి రవీంద్ర కట్కర్ ఆధ్వర్యంలో ఆరు బృందాలు రంగంలోకి దిగాయి. వర్లీ పోలీస్ స్టేషన్కు ఓ వ్యక్తి ఫోన్ చేయడంతో అతడు చనిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి సాఫ్ట్ టచ్ స్పా లోపల ఒక మృతదేహాన్ని కనుగొన్నట్లు తెలిపాడు. అతని శరీరం మొత్తం గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పలు క్లూల ఆధారంగా మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసాము.. పట్టుకోవడానికి వేటను కొనసాగిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిందితుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు.
Next Story