Tue Jan 20 2026 16:24:47 GMT+0000 (Coordinated Universal Time)
పక్కింటి వారితో గొడవ.. మహిళ కాల్చివేత
బాధిత మహిళను వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మరణించింది. ఆస్పత్రికి వచ్చేలోగానే ఆమె..

పక్కింటి వారితో జరిగిన గొడవలో.. ఓ మహిళ కాల్చివేతకు గురైంది. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మన్ ఖుర్ద్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరా నగర్ ప్రాంతంలో మహిళకు, ఆమె పొరుగింటివారికి ఏదో విషయంపై శనివారం (ఏప్రిల్ 29) గొడవ జరిగింది. ఈ ఘటనలో సదరు మహిళను కాల్చి చంపారు. గొడవకు దిగిన పక్కింటి మహిళ భర్త, ఆమె కొడుకు సంఘటనా స్థలానికి చేరుకుని ఒక రౌండ్ కాల్పులు జరపడంతో బాధితురాలి ఛాతీకి గాయమైనట్లు పోలీసులు వెల్లడించారు.
బాధిత మహిళను వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మరణించింది. ఆస్పత్రికి వచ్చేలోగానే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఆమెను కాల్చిన తర్వాత నిందితుడు, అతని కుమారుడు అక్కడి నుండి పారిపోయారు. కాగా.. మృతురాలు తన కూతురిపై నిందితుడి సోదరుడు అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపైనే ఇద్దరి మధ్యన గొడవ జరగడంతో.. మహిళపై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళపై కాల్పులు జరిపిన నిందితుడు, ఆమె కుమారుడు అక్కడి నుండి పరారయ్యారు.
Next Story

