Sat Mar 07 2026 19:34:42 GMT+0530 (India Standard Time)
పిల్లలకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య
కుటుంబ కలహాలే కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తొట్టంబేడు మండలంలోని..

ఇటీవల కాలంలో కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా జరుగుతున్న ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది. తాము చనిపోవడమే కాకుండా అభం, శుభం ఎరుగని పిల్లల ప్రాణాలు కూడా తీసేస్తున్నారు తల్లిదండ్రులు. తాజాగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి, ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడింది.
కుటుంబ కలహాలే కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తొట్టంబేడు మండలంలోని ఈదులగుంటకు చెందిన దంపతులు శివమ్మ (48), శివయ్య కాలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శివమ్మ ఇద్దరు పిల్లలకు ఉరివేసి, ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టమ్ కు పంపారు. మృతులు తల్లి శివమ్మ, లోకేశ్వర్ (11), దేవా (9) లుగా గుర్తించారు. అయితే శివమ్మే పిల్లలకు ఉరివేసి ఆత్మహత్య చేసుకుందా ? లేక భర్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా ? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్త శివయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

