Fri Dec 05 2025 17:34:16 GMT+0000 (Coordinated Universal Time)
Bathula Prbhakar : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల చిక్కడా? జిత్తుల మారిన బత్తుల ఎత్తులేంటి?
కరడు గట్టిన నేరగాడు బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నాడు. పోలీసుల కళ్ల గప్పి పారిపోయి పదిహేను రోజులకు పైగానే అవుతుంది.

కరడు గట్టిన నేరగాడు బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నాడు. పోలీసుల కళ్ల గప్పి పారిపోయి పదిహేను రోజులకు పైగానే అవుతుంది. బత్తుల ప్రభాకర్ ఎస్కార్ట్ పోలీసుల నుంచి గత నెల 22వ తేదీన తప్పించుకున్నాడు. ఇప్పటికి పదిహేను రోజులు గడుస్తున్నా బత్తుల ప్రభాకర్ ను పోలీసులు పట్టుకోలేకపోతున్నారంటే పోలీసుల చేతకానితనమా? బత్తుల జిత్తుల మారి వ్యవహారమా? అన్న చర్చ జరుగుతుంది. బత్తుల ప్రభాకర్ ను తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరు పోలీసుల నుంచి బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నాడు. ఒక హోటల్ వద్ద భోజనం చేయడానికి ఆగడంతో టాయ్ లెట్ కు వెళతానని చెప్పి బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నాడు. బత్తుల ప్రభాకర్ కు ఎస్కార్ట్ గా ఇద్దరు పోలీసులు మాత్రమే ఉన్నారు. దీంతో బత్తుల ప్రభాకర్ సులువుగా తప్పించుకున్నాడు. బ
ఫోన్ వాడక పోవడంతో...
మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పై తమిళనాడు, కర్ణాటకలో 44 కేసుల్లో నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 42 కేసులు నమోదయి ఉన్నాయి. బత్తుల ప్రభాకర్ కోసం పది ప్రత్యేక బృందాలు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అణువణువునా గాలిస్తున్నాయి. ప్రత్యేక పోలీసు బృందాలు బత్తుల ప్రభాకర్ కు బాగా అలవాటయిన తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు కూడా వెళ్లాయి. ఆ యా రాష్ట్రాల్లో బత్తుల ప్రభాకర్ కు సన్నిహితులున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏందంటే.. బత్తుల ప్రభాకర్ ఫోన్ వాడడు. అదే అతనిని పట్టుకోవడానికి కష్టంగా మారిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఫోన్ వినియోగిస్తే ట్రాక్ చేసి పట్టుకునే వీలుంటుందని, మారు వేషాల్లో బత్తుల తప్పించుకుని వెళ్లిపోయి ఉంటాడని, చేతికి ఉన్న బేడీలను కూడా తొలగించుకున్నది ఎక్కడ అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మారు వేషంలో తిరుగుతున్నాడని...
అందుకే బత్తుల ప్రభాకర్ కు సన్నిహితంగా ఉన్న వారిని కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. రూపం మార్చి మారు వేషంలో బత్తులు తిరుగుతుంటాడనిపోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో హైదరాబాద్ పబ్ లో పోలీసులపై బత్తుల ప్రభాకర్ కాల్పులు జరిపాడు. విశాఖ సెంట్రల్ జైలులో తనకు శత్రువుగా మారిన మరో నిందితుడిని హతమార్చేందుకు బత్తుల ప్రభాకర్ బీహార్ వెళ్లి మరీ మూడు గన్ లను కొని తీసుకు వచ్చాడు. అతనిని చంపేందుకు ప్లాన్ చేశాడు. అయితే రివాల్వర్ పేల్చడంలో అనుభవం లేకపోవడంతో ప్రాక్టీస్ కూడా చేయడం ప్రారంభించాడు. చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ 2013 నుంచి చోరీలను ప్రారంభించి ఇప్పటి వరకూ అనేక సార్లు జైలు ఊచలు లెక్క పెట్టి మరీ వచ్చాడు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో అతనిపై క్రిమినల్ కేసులున్నాయి. పదకొండుచోట్ల చోరీలుచేసి రెండున్నర కోట్లు దొంగిలించాడు. గతంలోనూ మూడేళ్లుగా పోలీసుల కన్నుగప్పి తిరిగాడు. ఇప్పడు కూడా పన్నెండు రోజులవుతున్నా బత్తుల జాడ తెలియకపోవడంతో పోలీసు శాఖ కూడా అతగాడి ఎత్తులను పసిగట్టలేకపోతున్నామన్న నిరాశలో ఉన్నట్లు కనపడుతుంది.
Next Story

