Sun Oct 06 2024 00:44:57 GMT+0000 (Coordinated Universal Time)
వీళ్లు మనుషులా ? రాక్షసులా? హత్యచేసి.. రోజుకో ముక్క నరికి.. ?
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో అత్యం పాశవికమైన, హృదయ విదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో అత్యం పాశవికమైన, హృదయ విదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడిని హత్య చేయడమే కాకుండా.. అతని శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి.. ఎవ్వరికీ అనుమానం రాకుండా బాత్రూమ్ లో తగలబెట్టేందుకు యత్నించారు నిందితులు. ఏదో దుర్వాసన వస్తుందని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అసలు విషయం బయటపడింది.
నలుగురు కలిసి...
పోలీసులు తెలిపిన వివరాల మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కొల్లాపూర్ లో జరిగిందీ ఘటన. నవంబర్ 24వ తేదీన నాగసాయి అలియాస్ వెంకటేష్ అని పిలవబడే యువకుడిని నలుగురు కలిసి అత్యంత పాశవికంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా తాము పోలీసులకు పట్టుబడకూడదన్న ఉద్దేశంతో మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి రోజుకొక అవయవాన్ని దహనం చేయాలని వ్యూహం రచించారు. అనుకున్నదే తడవు.. రోజుకొక అవయవాన్ని బాత్రూమ్ లో దహనం చేస్తూ వచ్చారు. చుట్టుపక్కల వారికి దుర్వాసన రావడంతో.. ఏదో జరుగుతుందన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శరీరభాగాలను...
వెంటనే రంగంలోకి దిగిన రాజనగరం పోలీసులు సగం కాలిన శరీర భాగాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నలుగురు నిందితుల్లో ఒకడిని అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాగసాయి అలియాస్ వెంకటేష్ ను ఆ నలుగురు ఎందుకు హత్య చేశారు ? ఆ నలుగురు ఎవరు ? మృతుడికి వీరికి మధ్య ఉన్న శతృత్వం ఏమిటి ? ఆస్తి తగాదాలా ? లేక ప్రేమ వ్యవహారమా ? అన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు.
Next Story