Sat Mar 07 2026 21:57:05 GMT+0530 (India Standard Time)
ఫాం హౌస్ కేసులో విచారణ వేగవంతం
మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో విచారణ వేగవంతమయింది. వల్లపల్లి తుషార్ కు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ నోటీసులు జారీ చేసింది.

మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో విచారణ వేగవంతమయింది. వల్లపల్లి తుషార్ కు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ నోటీసులు జారీ చేసింది. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయడం కోసం సిట్ ను ఏర్పాటు చేసింది.
తుషార్ కు నోటీసులు....
వల్లపల్లి తుషార్ రామచంద్రభారతి, పైలట్ రోహిత్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడటంతో ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో నిందితుల ఆడియో, వీడియోల్లోనూ తుషార్ పేరు పదే పదే వినిపించడంతో ఆయనను విచారించాలని సిట్ నిర్ణయించింది.
Next Story

