Sat Mar 07 2026 15:52:18 GMT+0530 (India Standard Time)
రెండు వారాల క్రితం పెళ్లి.. రెండ్రోజుల క్రితం అదృశ్యం.. ఇప్పుడు శవమై !?
రెండు వారాల క్రితమే పెళ్లైంది. రెండ్రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఇప్పుడు శవమై కనిపించాడు. ఇది ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి

రెండు వారాల క్రితమే పెళ్లైంది. రెండ్రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఇప్పుడు శవమై కనిపించాడు. ఇది ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి జీవితంలో జరిగిన ఘటన. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం కొండాపూర్ గ్రామంలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగి కొత్త నరేష్ మృతదేహం పోలీసులకు లభ్యమైంది. నరేష్ కు వివాహమయి రెండు వారాలే అయింది. గతేడాది డిసెంబర్ 26వ తేదీన కోకాపేటకు చెందిన యువతితో నరేష్ కు వివాహం జరిపించారు పెద్దలు. పెళ్లై రెండువారాలైనా అయిందో లేదో.. నరేష్ అదృశ్యమయ్యాడు.
Also Read : కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి
శనివారం కొండాపూర్ గ్రామంలోని మంగళకుంట చెరువు వద్ద నరేష్ బైక్, చెప్పులను గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో నరేష్ మృతదేహాన్ని వెలికి తీశారు. కాగా.. నరేష్ ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక ఎవరైనా హత్యచేసి చెరువులో పడేశారా ? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. నరేష్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Next Story

