Sat Sep 14 2024 11:27:07 GMT+0000 (Coordinated Universal Time)
బాలికపై తండ్రి అత్యాచారం
దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేట్ లో ఒక జంట పదేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఆ మహిళకు ఓ కూతురుంది. మహిళతో..
హైదరాబాద్ : ఆడపిల్లల రక్షణకై ఎన్ని చట్టాలు చేసినా.. ఎక్కడ జరిగే ఘోరాలు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఆడదైతే చాలు.. వావి వరసలు కూడా మరచిపోయి... క్షణికానందం కోసం వారి జీవితాలను చిదిమేస్తున్నారు కామాంధులు. చిన్న పిల్లలన్న కనికరం కూడా చూపకుండా.. రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. బాలికపై పెంపుడు తండ్రి అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన ఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.
దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేట్ లో ఒక జంట పదేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఆ మహిళకు ఓ కూతురుంది. మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి.. ఆమె కూతురిపై కన్నేశాడు. తల్లికి తెలియకుండా మారుతండ్రి కూతుర్ని లోబరుచుకున్నాడు. ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొద్దిరోజులుగా కూతురి ఆరోగ్యం బాలేకపోవడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లి, వైద్య పరీక్షలు చేయించింది. వైద్యులు ఆ బాలిక గర్భవతి అని తేల్చారు. దాంతో కూతురు జరిగిందంతా తల్లికి చెప్పడంతో ఆమె షాకయింది. ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story