Tue Sep 10 2024 11:58:00 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో దారుణం.. మైనర్ బాలికపై టిడిపి నేత అత్యాచారం
తోట నరేంద్ర తన పుట్టినరోజుకు రాత్రి 12 గంటలకు వచ్చి విషెస్ చెప్పాలని బాలికపై బెదిరింపులకు పాల్పడినట్లు బాధిత బాలిక చెప్తోంది.
విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఏదొక ప్రాంతంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటన తర్వాత.. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మహిళ హత్య.. తాజాగా విశాఖలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకొచ్చింది. టిడిపి నేత తోట నరేంద్ర మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తోట నరేంద్ర తన పుట్టినరోజుకు రాత్రి 12 గంటలకు వచ్చి విషెస్ చెప్పాలని బాలికపై బెదిరింపులకు పాల్పడినట్లు బాధిత బాలిక చెప్తోంది. అతని బెదిరింపులకు భయపడి అర్థరాత్రి 12 గంటలకు నరేంద్ర ఇంటికి వెళ్లి బర్త్ డే విషెస్ తెలిపింది. అదే సమయంగా భావించిన నరేంద్ర బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పగా.. వారు తోట నరేంద్రను నిలదీశారు.
జరిగిన ఘటనపై పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. టిడిపి నేత తోట నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై సెక్షన్ 329-22 376, సెక్షన్ 3 ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. నేడు నరేంద్రను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నరేంద్రను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Next Story