Sat Dec 07 2024 02:23:16 GMT+0000 (Coordinated Universal Time)
మరో కశ్మీరీ పండిట్ దారుణ హత్య
పండిట్ హత్య పై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పురాణ్ ను హతమార్చిన..
జమ్మూకశ్మీర్లో కశ్మీరీ పండిట్ల హత్యలు ఆగడం లేదు. మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కశ్మీరీ పండిట్లే టార్గెట్ గా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. కశ్మీర్ తమకే సొంతమని, పండిట్లు ఉండేందుకు వీల్లేదంటూ మారణకాండకు తెరలేపుతున్నారు. తాజాగా మరో కశ్మీరీ పండిట్ ను హత్య చేసి.. కలకలం సృష్టించారు. షోపియాన్ జిల్లాలోని చౌదరి గుండ్ ఏరియాలో ఉంటోన్న పురాణ్ కృష్ణన్ అనే కశ్మీరీ పండిట్ ను అతని ఇంటి వద్దే కాల్చి చంపేశారు ఉగ్రవాదులు.
పండిట్ హత్య పై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పురాణ్ ను హతమార్చిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. పురాణ్ కృష్ణన్ కు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇంటి నుంచి ఆయన ఎక్కువగా బయటకు వచ్చేవారు కాదని, ఇంట్లోనే ఎక్కువగా గడిపేవారని స్థానికులు, బంధువులు తెలిపారు. మరోవైపు కశ్మీరీ పండిట్ల హత్యలకు నిరసనగా.. పండిట్లంతా ఆందోళన చేస్తున్నారు.
Next Story