Tue Jan 20 2026 16:13:19 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త గూడెంలో దారుణం.. మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
మానసిక స్థితి సరిగా లేని మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బాధిత కుటుంబాన్ని

భద్రాచలం : కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం మరిగూడెం గ్రామంలో మానసిక స్థితి సరిగా లేని మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బాధిత కుటుంబాన్ని గ్రామ పెద్దలు బెదిరించారు. అంతేకాకుండా గ్రామంలోనేతేల్చుకోవాలని సూచించారు. ఏప్రిల్ 14న జరిగిన ఈ దారుణ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
నిందితుడు గ్రామానికి చెందిన బాలకృష్ణపై మహిళ తల్లిదండ్రులు లక్ష్మీదేవిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి ఏప్రిల్ 16న జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. పోలీసులను ఆశ్రయించినందుకు కుటుంబాన్ని బహిష్కరిస్తామని గ్రామ పెద్దలు బెదిరిస్తున్నారని మహిళ తల్లిదండ్రులు ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని వర్గాలు తెలిపాయి.
Next Story

