Thu Sep 12 2024 13:28:38 GMT+0000 (Coordinated Universal Time)
ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య
ఎస్ఆర్ నగర్ పీఎస్ లిమిట్స్ లోని శ్రీరామ్ నగర్ కు చెందిన యువతి ఎంబీఏ చదువుతోంది. యువతి తండ్రి సంజయ్ నగర్లో..
హైదరాబాద్ : ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. యువతి ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. తొలుత ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావించారు. కానీ.. యువతి ఆత్మహత్యకు వేరే కారణాలున్నట్లు ఎస్ఆర్ నగర్ పీఎస్ పోలీసులు తెలిపారు.
ఎస్ఆర్ నగర్ పీఎస్ లిమిట్స్ లోని శ్రీరామ్ నగర్ కు చెందిన యువతి ఎంబీఏ చదువుతోంది. యువతి తండ్రి సంజయ్ నగర్లో ఆటోమొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా యువతి తరచూ మొబైల్ లో చాటింగ్ చేస్తుండటంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. మొబైల్ లో చాటింగ్ చేసినందుకు తల్లిదండ్రులు తిట్టడంపై మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం యువతి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Next Story