Fri Feb 14 2025 12:31:07 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరీ మస్తాన్ సాయి? ఇతని బ్యాక్ గ్రౌండ్ చూస్తే బెదిరిపోవాల్సిందేనా?
మస్తాన్ సాయి.. ఇప్పుడు వందల మంది యువతులతో పాటు టాలీవుడ్ లో యువ హీరోలను కొందరిని ఈ నేమ్ షేక్ చేస్తుంది

మస్తాన్ సాయి.. ఇప్పుడు వందల మంది యువతులతో పాటు టాలీవుడ్ లో యువ హీరోలను కొందరిని ఈ నేమ్ షేక్ చేస్తుంది. అనేక వీడియోలను తన గుప్పిట్లో ఉంచుకుని బెదిరింపులకు దిగుతూ తన పబ్బం గడుపుతున్న మస్తాన్ సాయిని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. గతంలో డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. గతంలో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ను తీసుకు వస్తున్నాడన్న సమాచారంతో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. ఇక సినీ హీరో రాజ్ తరుణ్ వ్యవహారంలో వివాదంలో ఉన్న లావణ్య మస్తాన్ సాయితో పాటు తాజాగా బిగ్ బాస్ లో పాల్గొన్న శేఖర్ భాషాపై కూడా ఫిర్యాదు చేశారు. మస్తాన్ సాయి ఎవరన్నది ఇప్పుడు నెట్టింట అనేక మంది సెర్చ్ చేస్తున్నారు.
గుంటూరుకు చెందిన...
మస్తాన్ సాయిది గుంటూరు. అతని పూర్తి పేరు రావి మస్తాన్ సాయి. బీటెక్ చదివిన మస్తాన్ సాయి తర్వాత సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా హైదరాబాద్ లో పనిచేశాడు.టాలీవుడ్ లో పలువురితో మస్తాన్ సాయికి సంబంధాలున్నట్లు కూడా పోలీసుల విచారణలో బయటపడింది. అమ్మాయిల వీడియోలు తీసి వాటిని బయట పెడతానని బెదిరించి సొమ్ము చేసుకోవడం మస్తాన్ సాయి హాబీగా మార్చుకున్నారని పోలీసులు తెలిపారు. లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్ లో అనేక మంది యువతులకు చెందిన వీడియోలతో పాటు టాలీవుడ్ కు చెందిన ప్రముఖలకు సంబంధించిన ప్రయివేటు వీడియోలు కూడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని మస్తాన్ సాయి వీడియో కాల్ తో బెదిరించడం కూడా అలవాటుగా మార్చుకున్నాడు.
వందకు పైగా వీడియాలు...
దాదాపు వందకు పైగా వీడియోలు అతని వద్ద ఉన్నట్లు లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించింది. కస్టడీ పిటీషన్ వేయాలని నిర్ణయించింది. యువతులతో పాటు వివాహితులకు డ్రగ్స్ అలవాటు చేసి వారి వీడియోలను నెట్ లో పెడతానని బెదిరిస్తూ తన కోర్కెలను తీర్చుకునే వాడని లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. అయితే పోలీసులు ఎవరైనా మస్తాన్ సాయి బాధితులుంటే నేరుగా వచ్చిఫిర్యాదుచేయాలని, వారి పేర్లను తాము గోప్యంగా ఉంచుతామని చెబుతున్నారు. బ్లాక్ మెయిలింగ్ చేసే మస్తాన్ సాయికి ఎవరూ భయపడాల్సిన పనిలేదని కూడా పోలీసులు భరోసా ఇస్తున్నారు.
Next Story