Fri Dec 05 2025 09:11:42 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : అయోధ్యకు సమీపంలో భారీ పేలుడు - ఐదుగురు మృతి
ఉత్తర్ ప్రదేశ్ లో భారీ పేలుడు సంభవించింది.

ఉత్తర్ ప్రదేశ్ లో భారీ పేలుడు సంభవించింది. అయోధ్య కు సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. అయోధ్యకు సమీపంలో ఉన్న పగ్లా గ్రామంలో భారీ పేలుడు జరిగి ఒక ఇల్లు కూలిపోయింది. అయితే ఈ ఇల్లు కుప్పకూలిపోవడంతో శిధిలాల కింద కొందరు చిక్కుకున్నారని సమాచారం. అయితే వెంటనే సమాచారం అందుకున్న సహాయక బృందాలు సంఘటన స్థలికి చేరుకునిచర్యలు చేపట్టాయి.
ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి...
శిధిలాలను తొలగించే పనిని చేపట్టారు. పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియరాలేుద. అయోధ్య జిల్లాలోని పూరా కలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీంతో ముఖ్యమంత్రి యోగా ఆదిత్యానాధ్ ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారుల అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు.
Next Story

