Fri Mar 20 2026 20:53:13 GMT+0530 (India Standard Time)
యూపీలో విషాదం.. 22 మంది మృతి
ఉత్తర్ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు అనేక మంది మరణిస్తున్నారు. పురాతన భవనాల్లో ప్రజలు భయంతో గడుపుతున్నారు.

ఉత్తర్ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు అనేక మంది మృత్యువాత పడుతున్నారు. పురాతన భవనాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శుక్రవారం లక్నో, ఉన్నావ్, ఫతేపూర్, సీతాపూర్ లో ఇళ్లు కూలిన ఘటనలో 22 మంది మరణించారు. ఆర్మీ కేంద్రం వద్ద నిర్మిస్తున్న గోడ కూలి పక్కనే గుడెసెలు వేసుకుని జీవిస్తున్న తొమ్మిది మంది మరణించారు. వీరంతా ఝాన్సీ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. ఈ ప్రమాదం నుంచి ఒకరు బయటపడి కోలుకున్నారని పోలీసు అధికారులు తెలిపారు.
ఇళ్లు కూలి....
ఇక ఉన్నావ్ జిల్లాలోని కాంతా గ్రామంలో ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. కసందా, ఝాలీహాయ్ గ్రామాల్లోనూ ఇళ్లు కూలి ఇద్దరు మరణించారు. ఫతేపూర్ జిల్లాలో ముగ్గురు మరణించగా, ప్రయాగరాజ్ లో ఇద్దరు చిన్నారులు, సీతాపూర్ జిల్లాలో ఒకరు మరణించారు. మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియోను ప్రకటించింది.
Next Story

