Fri Dec 05 2025 12:38:25 GMT+0000 (Coordinated Universal Time)
జాహిద్ గ్యాంగ్.. ప్లాన్ ఇదే
హైదరాబాద్ లో జాహిద్ అరెస్ట్ లో అనేక అంశాలు వెలుగు చూశాయి. జాహేద్ గ్యాంగ్ దసరా ఉత్సవాలను లక్ష్యంగా చేసుకుంది.

హైదరాబాద్ లో జాహిద్ అరెస్ట్ లో అనేక అంశాలు వెలుగు చూశాయి. జాహేద్ గ్యాంగ్ దసరా ఉత్సవాలను లక్ష్యంగా చేసుకుంది. దసరా నవరాత్రుల సందర్భంగా మూకుమ్మడి దాడులకు పాల్పడాలని కుట్ర పన్నిందని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు జాహిద్ అతని టీం పై సీసీఎస్ లోనూ, సిట్ లోనూ కేసు నమోదయింది. మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. జాహిద్ తో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఏడుగురిని...
సుజి, సమియుద్దీన్, అదీల్ అఫ్రోజ్, అబ్దుల్, సోహెల్ ఖురేషి, అబ్దుల్ కలీమ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాకిస్థాన్ నుంచి నిధులు జాహిద్ కు అందుతున్నాయని కనుగొన్నారు. దాడుల కోసం పాకిస్థాన్ నుంచి గ్రనేడ్స్ కూడా పంపినట్లు పోలీసులు చెబుతున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలపై దాడులతో పాటు జనం రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరస దాడులకు పాల్పడాలని ప్లాన్ చేశారు. పాకిస్థాన్, ఐఎస్ఐ లకు చెందిన హ్యాండ్లర్స్ తో జాహిద్ కు లింకులున్నాయని కనుగొన్నారు. మొత్తం మీద హైదరాబాద్ లో కుట్ర కేసును పోలీసులు భగ్నం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Next Story

