Tue Sep 10 2024 12:12:59 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటి అద్దె కట్టలేదని ఇంత చేయాలా..?
ఆగ్నేయ ఢిల్లీలో అద్దె చెల్లించలేదని ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. ఈ ఘటన న్యూ ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
న్యూ ఢిల్లీ : సాధారణంగా ఇంటి అద్దె కట్టకుంటే ఏమి చేస్తాం చెప్పండి.. తర్వాతి నెల తప్పకుండా ఇవ్వాలని అడుగుతాం. అసలు కట్టలేము అని రెంట్ కు ఉన్నవాళ్లు చెబితే తర్వాతి నెల నుండి ఇక ఇల్లు ఖాళీ చేయించడమో వంటివి చేస్తాం. సౌత్ ఈస్ట్ ఢిల్లీలో రెంట్ కట్టలేదని ఓ వ్యక్తికి నరకం చూపించారు.
ఆగ్నేయ ఢిల్లీలో అద్దె చెల్లించలేదని ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. ఈ ఘటన న్యూ ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతంలో చోటుచేసుకుంది. చాలా రోజులుగా అద్దె చెల్లించకపోవడంతో మోను, సుర్జీత్ అనే వ్యక్తులు బాధితుడు ధర్మేంద్రను కొట్టిన సంఘటన ఏప్రిల్ 29న చోటు చేసుకుంది. ధర్మేంద్రను కొట్టే సమయంలో చేతులు, కాళ్లు కట్టివేసినట్లు తెలుస్తోంది. అనంతరం కుర్చీకి కూడా కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 323, 341, 342, 506 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సౌత్ ఈస్ట్ ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డిసిపి) ఈషా పాండే తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు
Next Story