Fri Dec 05 2025 17:38:56 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటర్నెట్ లో వీడియోలను చూసి.. భార్యను చంపేశాడు.. ట్విస్ట్ ఏమిటంటే..!
ఇంటర్నెట్ లో వీడియోలను చూసి.. భార్యను చంపేశాడు..

అప్పటికే చాలా అప్పులు చేసేశాడు.. ఆ అప్పులు తీర్చాలంటే ఏమి చేయాలా అని అనుకునే సమయంలో భార్యను అంతమొందించి.. ఆమె ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవాలని అనుకున్నాడు. అందులో భాగంగా ఆమెను కాల్చేశాడు సదరు వ్యక్తి.. కానీ పోలీసుల విచారణలో ఇదంతా భర్త ప్లాన్ అని గుర్తించారు.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్నెట్లో వీడియోలు చూసి తన అప్పులు తీర్చడానికి భార్యను కాల్చి చంపాడు ఓ వ్యక్తి. నిందితుడైన భర్త బద్రీప్రసాద్ మీనాను అరెస్టు చేశారు. హత్య ప్లాన్ ను అమలు చేసేందుకు నిందితులు ఇంటర్నెట్ సాయం తీసుకున్నారు. తన అప్పులు తీర్చడానికి ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ఇంటర్నెట్లో అనేక వీడియోలను చూశాడు. కొన్ని వీడియోలు చూసిన తర్వాత, అతను మొదట తన భార్యకు బీమా చేయించాడు. బీమా డబ్బు కోసం ఆమెను చంపాడు.
జూలై 26న రాత్రి 9 గంటల ప్రాంతంలో భోపాల్ రోడ్డులోని మన జోడ్ సమీపంలో భార్య పూజపై భర్త కాల్పులు జరిపాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. భర్త మొదట పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. కానీ విషయం నిశితంగా విచారించగా ఎట్టకేలకు పట్టుబడ్డాడు. భార్యను హత్య అనంతరం నిందితుడు తన భార్యను హత్య చేసినందుకు నలుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. హత్య జరిగిన సమయంలో ఆ నలుగురు వ్యక్తులు నేరస్థలంలో లేరని దర్యాప్తులో తేలింది. పోలీసులు బద్రీప్రసాద్ మీనాను అతని సహచరులలో ఒకరిని అరెస్టు చేశారు. అతని ఇద్దరు సహచరులు ఇంకా పరారీలో ఉన్నారు. నిందితుడిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
News Summary - Man takes help from internet to kill wife, gets her insured to claim money
Next Story

