Fri Oct 11 2024 08:32:58 GMT+0000 (Coordinated Universal Time)
మచిలీపట్నంలో దారుణం.. తల్లితో సహజీవనం చేస్తూనే కూతురిపై..
కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన కోమటి సురేష్ ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు 17 సంవత్సరాల..
మచిలీపట్నం : ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న మృగాళ్లకు ఎన్ని కఠిన శిక్షలు వేసినా.. కామాంధుల ఆలోచనల్లో ఆవగింజంతైనా మార్పు రావట్లేదు. అభం శుభం తెలియని పసిపిల్లల నుంచి.. ముసలమ్మల వరకూ ఎవ్వరినీ వదలట్లేదు. తాజాగా మచిలీపట్నంలో మరో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. తల్లితో సహజీవనం చేస్తూనే.. ఆమె కూతురిపై 10 నెలలుగా అత్యాచారం చేశాడో కామాంధుడు. తండ్రి స్థానంలో ఉండి.. అన్ని తానై చూసుకుంటూ, మృగాళ్ల బారి నుంచి కాపాడాల్సిన అతనే.. ఆ బాలిక పాలిట శాపమయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన కోమటి సురేష్ ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు 17 సంవత్సరాల కూతురు ఉంది. తల్లితో సహజీవనం చేస్తూనే.. ఆమె కూతురిపై కన్నేశాడు. బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించసాగాడు. అలా 10 నెలలుగా ఇదే తంతు జరుగుతోంది. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. నిన్న బాలిక బంధువులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చింది బాలిక. విషయం తెలుసుకున్న పోలీసులు.. కోమటి సురేష్ ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story