Thu Sep 19 2024 00:00:21 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరితో మహిళ సహజీవనం.. ఓర్చుకోలేక ఆఖరికి ఇలా !
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గుత్తి విజయ్, ఉష అనే మహిళ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. విజయ్ తో ఉంటుండగానే.. ఉషకు..
నందిగామ : సహజీవనం.. కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న ఆధునిక పోకడ ఇది. పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ పోకడ.. క్రమంగా మన దేశానికీ వ్యాపించి.. ఒక వ్యసనంలా తయారైంది. క్షణికానందం కోసం సహజీవనం పేరుతో.. చేయరాని పనులు చేస్తున్నారు. ఆఖరికి అవి.. ఒకరినొకరు చంపుకునేందుకు దారి తీస్తున్నాయి. ఒక మహిళ ఇద్దరు పురుషులతో సహజీవనం చేస్తోంది. తనతో కాకుండా మరొక వ్యక్తితో చనువుగా ఉండటాన్ని చూడలేకపోయిన విజయ్.. అతడిని హత్య చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గుత్తి విజయ్, ఉష అనే మహిళ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. విజయ్ తో ఉంటుండగానే.. ఉషకు వరి అప్పాజీ అనే మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడితోనూ శారీరక సంబంధం ఏర్పడటంతో.. విజయ్, ఉష, అప్పాజీ లు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ ముగ్గురూ మూడ్రోజుల క్రితం కృష్ణాజిల్లా నందిగామలో ఉన్న ఓ హోటల్ లో పనిచేసేందుకు వచ్చారు. ఉష తనతో కంటే అప్పాజీతో ఎక్కువ చనువుగా ఉండటాన్ని విజయ్ గమనించాడు. అది చూడలేక.. నిద్రపోతున్న సమయంలో అప్పాజీని పీకకోసి హతమార్చాడు. అడ్డొచ్చిన ఉషకు కూడా తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
Next Story