Thu Mar 19 2026 11:53:56 GMT+0530 (India Standard Time)
మియాపూర్ బస్టాండ్ లో వ్యక్తి దారుణహత్య
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు. కాగా..

హైదరాబాద్ లోని మియాపూర్ బస్టాండ్ ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మిట్టమధ్యాహ్నం అందరూ చూస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యక్తి హత్యతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. హత్యను కళ్లారా చూసినవారంతా ఉలిక్కిపడ్డారు. మియాపూర్ బస్టాండ్ లో నిలబడి ఉన్న వ్యక్తిపై కొందరు దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడిచేశారు.
ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఎవరు? ఎందుకు చంపారు? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కుటుంబ కలహాలు, ప్రేమ తగాదాలు, ఆస్తి తగాదాలు ఇలా కారణమేదైనా కానీ.. ప్రాణం తీయడం, ప్రాణం తీసుకోవడమే పరిష్కారంగా భావించి.. దారుణాలకు పాల్పడుతున్నారు.
Next Story

