Thu Jan 29 2026 04:11:47 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియురాలితో శృంగారం చేస్తూ.. వ్యాపారవేత్త మృతి
అనంతరం అతడు తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఆమెతో శృంగారం చేస్తూ.. గుండెపోటుతో మరణించాడు. యజమానితో..

శృంగారం.. ప్రకృతిలో భాగంగా స్త్రీ, పురుషుల మధ్య జరిగే సహజ ప్రక్రియ. ఇది మనిషిలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అదే శృంగారం ఇప్పుడు ప్రాణాంతకంగా కూడా మారుతుంది. ప్రియురాలితో శృంగారం చేస్తూ.. వ్యాపారవేత్త మృతి చెందిన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. స్థానికంగా ఈ ఘటన సంచలనమైంది. ప్రియుడి మరణంతో వణికిపోయిన ఆమె.. ఏం చేయాలో తెలియక తన సోదరుడు, భర్తకు సమాచారమిచ్చింది. ఆ తర్వాత అంతా కలిసి మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో కుక్కి పడేశారు. కొడుకు తన తండ్రి పై మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 67 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన వారం తర్వాత అతని మరణానికి గల కారణాలు తెలిశాయి. జేపీ నగర్ పుట్టెనహళ్లికి చెందిన బాల సుబ్రమణియన్ (67) వ్యాపారవేత్త. తన ఇంట్లో పనిచేసే 35 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీలు కుదిరినప్పుడల్లా వీరిద్దరూ వ్యవహారం సాగించేవారు. నవంబర్ 16న తన మనవడిని బ్యాడ్మింటన్ కోచింగ్ వద్ద దింపేందుకు ఇంటి నుండి బయల్దేరాడు. సాయంత్రం 4.55 గంటల సమయంలో కోడలికి ఫోన్ చేసి ఆలస్యంగా వస్తానని చెప్పాడు.
అనంతరం అతడు తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఆమెతో శృంగారం చేస్తూ.. గుండెపోటుతో మరణించాడు. యజమానితో తన అక్రమ సంబంధం బయటపడితే పరువు పోతుందని భావించిన ఆ మహిళ.. తన సోదరుడు, భర్తకు విషయం చెప్పింది. ఆలస్యంగా వస్తానని చెప్పిన మామగారు ఎంతకీ ఇంటికి రాకపోయే సరికి భర్తకు విషయం చెప్పింది. తండ్రి మిస్ అయినట్లు సుబ్రమణ్య నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒకరోజు తర్వాత పోలీసులకు ప్లాస్టిక్ కవర్లు, బెడ్ షీట్ తో చుట్టి ఉన్న ఓ అనుమానాస్పద మృతదేహం జేపీ నగర్లోని నిర్మానుష్య ప్రాంతంలో కనిపించింది. కాల్ డేటా ఆధారంగా పోలీసులు పనిమనిషిని విచారించడంతో అసలు విషయం చెప్పింది. ఆమె పై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు.
Next Story

