Fri Dec 05 2025 09:23:49 GMT+0000 (Coordinated Universal Time)
Women PG: అమ్మాయిల పీజీలోకి చొరబడి.. గొంతు కోసి చంపేశాడు
పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో 22 ఏళ్ల యువతిని

మంగళవారం రాత్రి బెంగళూరులోని కోరమంగళలోని పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో 22 ఏళ్ల యువతిని గొంతు కోసి చంపేశాడు ఓ వ్యక్తి. మృతురాలు బీహార్కు చెందిన కృతి కుమారి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కోరమంగళలోని వీఆర్ లేఅవుట్లోని వసతి గృహంలో ఉంటోందని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 11.10 నుంచి 11.30 గంటల మధ్య పీజీ ఆవరణలోకి ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
మూడో అంతస్తులోని ఓ గది సమీపంలో కృతిపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సౌత్ ఈస్ట్ డివిజన్ డీసీపీ సారా ఫాతిమాతో పాటు కోరమంగళ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలిసిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. సారా ఫాతిమా మాట్లాడుతూ.. ఒక వ్యక్తి ఆమె ఉంటున్న వసతి గృహంలోకి ప్రవేశించి, ఆమె గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత ఆమె అక్కడికక్కడే మరణించింది. హత్య వెనుక గల కారణాలపై మేము దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Next Story

