Thu Mar 19 2026 04:36:09 GMT+0530 (India Standard Time)
మహబూబాబాద్ లో దారుణం.. కౌన్సిలర్ హత్య
8వ వార్డు కౌన్సిలర్ బానోతు రవిపై ఆగంతకులు గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో రవి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పత్తిపాకలో 8వ వార్డు కౌన్సిలర్ బానోతు రవిపై ఆగంతకులు గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో రవి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. రోడ్డుపక్కన నిలబడి ఉన్న రవిపై దుండగులు ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. రక్తపుమడుగులో పడి ఉన్న రవిని గుర్తించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కౌన్సిలర్ బానోతు రవి మృతి చెందారు. కాగా.. రవి హత్యకు గల కారణాలేంటి ? దాడి చేసింది ఎవరు ? చేయించింది ఎవరు ? రాజకీయ కలహాలా ? కుటుంబ కలహాలా ? తదితర విషయాలు తెలియాల్సి ఉంది.
Next Story

