Wed Jan 21 2026 10:27:45 GMT+0000 (Coordinated Universal Time)
లవ్ ఫెయిల్యూర్.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య
తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోని కారణంగా విష్ణుప్రియ చనిపోయినట్లు తెలుస్తోంది.

తిరుపతి : ప్రాణంగా ప్రేమించిన వారు తమకు దూరమవ్వడంతో తట్టుకోలేని ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు తిరుపతిలో చోటుచేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తిరుపతిలోని పద్మావతి కళాశాలలో విష్ణుప్రియ(17) ఇంటర్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు కువైట్ లో ఉంటున్నారు.
తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోని కారణంగా విష్ణుప్రియ చనిపోయినట్లు తెలుస్తోంది. మృతురాలు కె.వి పల్లి మండలం గర్ని మిట్ట వాసిగా గుర్తించారు. అలాగే తిరుపతిలోని బీసీ హాస్టల్ లో ఉంటున్న మరో ఇంటర్ విద్యార్థి నాగేంద్ర కుమార్ హాస్టల్ ఐదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలమవ్వడంతో నాగేంద్రకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడుచిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బీమగానిపల్లికి చెందిన వాడిగా గుర్తించారు.
Next Story

