Mon Sep 09 2024 12:55:12 GMT+0000 (Coordinated Universal Time)
మినీ లారీని ఢీ కొట్టిన లారీ.. ముగ్గురు మృతి
బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని రాప్తాడు మండలం..
అనంతపురం : అనంతపురం జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని రాప్తాడు మండలం రాంనేపల్లి వద్ద తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రిపేరులో ఉన్న మినీ లారీని మరో వాహనం సహాయంతో తరలిస్తున్నారు. ఇంతలో ఎదురుగా వచ్చిన లారీ..బలంగా ఢీ కొట్టడంతో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు. స్థానికులు రాప్తాడు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story