Thu Mar 19 2026 06:13:31 GMT+0530 (India Standard Time)
ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురి మృతి
క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పుల్లంపేట సమీపంలోని..

అన్నమయ్య జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పుల్లంపేట మండలంలో ఆర్టీసీ బస్సు - లారీ ఢీ కొన్న ప్రమాదంలో మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పుల్లంపేట సమీపంలోని మలుపు వద్ద జాతీయ రహదారిపై.. కడప నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన సిమెంటు లారీ వేగంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా రాజంపేట - తిరుపతి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
Next Story

