Sat Mar 07 2026 18:02:10 GMT+0530 (India Standard Time)
సత్తెనపల్లిలో రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. లారీ కారును ఢీకొట్డడంతో ఇద్దరు మృతి చెందారు.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. లారీ కారును ఢీకొట్డడంతో ఇద్దరు మృతి చెందారు. అక్కడికక్కడే మరణించారని పోలీసులు చెప్పారు. మృతులు శాలివాహననగర్ కు చెందిన వారుగా గుర్తించారు. సత్తెనపల్లి నుంచి పాఠశాలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారను.
లారీ ఢీకొట్టడంతో...
లారీ వేగతం వచ్చి కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణం లారీ డ్రైవర్ నిర్లక్ష్యమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

