Fri Dec 05 2025 17:19:03 GMT+0000 (Coordinated Universal Time)
అరటిగెలల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్ !
ఎల్బీనగర్ పరిధిలో శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు పోలీసులు. అదేసమయంలో

హైదరాబాద్ : పుష్పసినిమా తరహాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఎల్బీనగర్ పరిధిలో శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు పోలీసులు. అదేసమయంలో అరటిపండ్ల లోడుతో వస్తోన్న వాహనాన్ని పోలీసులు అడ్డుకుని తనిఖీలు చేశారు. వాహనంలో ఉన్న అరటిగెలలను తీసి చూడగా.. కింద ఎర్రచందనం దుంగలు కనిపించాయి. దాంతో అరటిగెలలు, ఆకులను కప్పి దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించి.. ఇద్దదరు నిందితులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. ఈ ఎర్రచందనం దుంగలను ఏపీ నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 31 ఎర్రచందనం దుంగలు, మూడు మొబైల్ ఫోన్లు, రూ.1600 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగల విలువ రూ.60 లక్షలపైనే ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story

