Fri Dec 05 2025 11:19:59 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : నిద్రలోనే బతుకులు తెల్లారి పోయాయి...అతి వేగమే అసలు కారణమా?
కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నెలకొంది

కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నెలకొంది. నిద్రలోనే ప్రాణాలను వదిలారు. తెల్లవారు జామున ఈ ఘటన జరగడంతో ప్రయాణికులందరూ పూర్తిగా నిద్రలో ఉన్నారు. అయితే వారు నిద్రలోనే తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లారు. ఒక ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో బస్సు కిందకు వచ్చి మూడు వందల కిలోమీటర్ల మేరకు ఆ ద్విచక్ర వాహనాన్ని పెట్రోలు ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బస్సు వేగం కారణంగా మంటలు బస్సు మొత్తం త్వరగా వ్యాపించాయి. . బస్సు దగ్దమైన ఘటనలో ఇరవై మందికిపైగా సజీవదహనమయ్యారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
డ్రైవర్ నిర్లక్ష్యమే...
కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్–బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఈ ప్రమాదానికి గురయింది. అయితే ఈ బస్సును వెంటనే డ్రైవర్ నిలపకుండా వేగంగా పోనివ్వడంతో మంటలు మరింత వేగంగా అంటుకున్నాయని తెలిపారు. ఇది పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యమేనని ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్లే ఈ బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులున్నారు. వీరిలో ఇరవై మంది వరకూ మరణించారు. డ్రైవర్, క్లీనర్ తప్పించుకోవడంతో అసలు కారణం తెలియరాలేదు. అతివేగం, నిర్లక్ష్యం ఇందరి ప్రాణాలను తీసింది. బస్సు నుంచి 23 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బైక్ పై వెళుతున్న వ్యక్తి కూడా చనిపోయాడు.
బయటపడిన వారు వీరే...
ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు ఇంకా ఈ ఘటన నుంచి తేరుకోలేకపోతున్నారు. బయటపడిన వారిలో సుబ్రమణ్యం, జయసూర్య, రమేష్, అకీర, జస్మిత, అఖిల్, నవీన్ కుమార్, శ్రీలక్ష్మి, సత్యనారాయణ, వేణుగోపాల్ రెడ్డి, రామిరెడ్డితో పాటు హిందూపూర్ కు చెందిన నవీన్ ప్రాణాలతో బయటపడ్డారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న హైమారెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసిన తర్వాత ఆమె అందించిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణాలతో ఉండి గాయపడిన వారిని కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని చెబుతున్నారు.
Next Story

