Wed Feb 18 2026 17:14:33 GMT+0530 (India Standard Time)
మదనపల్లి సైకో కులవర్ధన్ మృతి.. బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కులవర్థన్ చనిపోయాడు

అన్నమయ్య జిల్లాలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కులవర్థన్ చనిపోయాడు. సైకో గా మారి తన ఎదురు ఇంట్లో నివాసం ఉంటున్న చిన్నారిని తీసుకెళ్లి హతమార్చిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. మదనపల్లె పట్టణంలో ఏడో తరగతి చదువుతున్న బాలిక సోమవారం స్కూలుకు సెలవు కావడంతో ఇంటి వద్ద ఉంది. తల్లి పనికి వెళ్లింది. అయితే చిన్నారి కోసం ఊరంతా గాలించినా ఆచూకీ లభించలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లకు కూడా వెళ్లి వెదికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎదురింట్లోనే ఉంటున్న...
ఆ బాలిక ఎదురింట్లోనే ఉంటున్న కులవర్థన్ వెంట బాలిక వెళ్లిందని సీసీ టీవీ ఫుటేజీలో గమనించారు. కులవర్థన్ కు క్రిమినల్ హిస్టరీ ఉంది. అతని ఇంట్లో గాలించడానికి పోలీసులు వెళ్లినప్పుడు కులవర్థన్ తలుపు తీయలేదు. అయితే కిటికీ లో నుంచి చూస్తే కులవర్థన్ నిద్రపోతూ ఉన్నాడు. అయితే చిన్నారి తాత మాత్రం కులవర్థన్ తోనే కలసి వెళ్లిందని పోలీసులకు చెప్పడంతో అతని కోసం వెదికారు కనిపించలేదు. కానీ కులవర్థన్ ఇంట్లో డ్రమ్ములో బాలిక శవం కనిపించింది. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కులవర్థన్ ను ఎన్ కౌంటర్ చేయాలని బాలిక తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు కూడా డిమాండ్ చేశారు.
చెరువులో పడి...
సంఘటన జరిగిన నాటి నుంచి కులవర్థన్ కుటుంబ సభ్యులు కూడా ఇల్లు వదలి పారిపోయారు. అయితే ఈరోజు కులవర్థన్ మృతదేహం జిల్లాలోని కురబలకోట మండలం కనసాని వారిపల్లె చెరువులో కనిపించింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని కులవర్ధన్ మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే కులవర్థన్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరేదైనా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరొకవైపు బాలిక మృతదేహానికి నేడు బంధువులు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అమాయక బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కులవర్థన్ మృతిపై మదనపల్లె ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

