Mon May 06 2024 01:31:55 GMT+0000 (Coordinated Universal Time)
ప్రణీత్‌రావు వ్యవహారం.. అధికారుల ఇళ్లలో సోదాలు
మాజీ డీఎస్పీ ప్రణీత్ రావ్ ఫోన్ టాపింగ్ కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.
మాజీ డీఎస్పీ ప్రణీత్ రావ్ ఫోన్ టాపింగ్ కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. మాజీ పోలీసు అధికారుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తో పాటు పలువురు ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబి డీఎస్పి తిరుపతన్న ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.
పది ప్రాంతాల్లో...
హైదరాబాద్ సిటీ మాజీ టాస్‌ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలను పంజాగుట్ట పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు ,రాధా కిషన్‌లు హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నేడు ప్రణీత రావు ను కోర్టులో పోలీసులు హాజరు పరచనున్నారు.
Next Story