Tue Jan 20 2026 19:03:29 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లింట రక్తపు సింధూరం
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరువనంతపురం జిల్లాలోని కల్లంబలంకు చెందిన రాజు (61) కుమార్తె వివాహం బుధవారం (జూన్28)

కొత్త దంపతులతో, బంధువులతో కళకళలాడాల్సిన పెళ్లి ఇల్లు.. రక్తపు చారికల సింధూరం దిద్దుకుంది. వధువు తండ్రిని పక్కింటి యువకుడు.. తన సోదరుడు, స్నేహితుడితో కలిసి దాడిచేసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన కేరళలో జరిగింది. పెళ్లికి ముందురోజు రాత్రి యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కుమార్తెను తనకిచ్చి పెళ్లి చేసేందుకు ఒప్పుకోని నేపథ్యంలోనే అతను కక్షతో ఈ హత్య చేసినట్లు మృతుడి బంధువులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరువనంతపురం జిల్లాలోని కల్లంబలంకు చెందిన రాజు (61) కుమార్తె వివాహం బుధవారం (జూన్28) ఉదయం జరగాల్సి ఉంది. మంగళవారం రాత్రి అతని పక్కింట్లో నివసించే జిష్ణు తన సోదరుడు జిజిన్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రాజు ఇంటికి వెళ్లి గొడవపడ్డారు. రాజు భార్యను, కుమార్తెను చితకబాదారు. అడ్డుకునేందుకు యత్నించిన రాజు తలపై పారతో పలుమార్లు మోదడంతో... అతనికి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. రెండేళ్ల క్రితమే జిష్ణు తనకు రాజు కుమార్తెనిచ్చి వివాహం చేయాలని అడిగాడు. అందుకు రాజు అంగీకరించలేదు. అతనికి నేరచరిత్ర ఉండటమే అందుకు కారణమని రాజు బంధువొకరు చెప్పారు. ఆ కక్షతోనే రాజును చంపారని పోలీసులు తెలిపారు. నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story

