Sat Sep 14 2024 11:21:32 GMT+0000 (Coordinated Universal Time)
అతి పెద్ద మోసం... 3,520 కోట్లు
కార్వి సంస్థ మోసం 3,520 కోట్లకు చేరింది. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జి షీటు దాఖలు చేశారు
కార్వి సంస్థ మోసం 3,520 కోట్లకు చేరింది. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జి షీటు దాఖలు చేశారు. ఐదు వేల పేజీల ఛార్జిషీట్ ను కోర్టులో అనేక విషయాలను సీసీఎస్ పోలీసులు పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల నుంచి క్వారీ సంస్థ బ్యాంకుల నుంచి 2,800 కోట్ల రుణాలను పొందింది. కస్టమర్ల షేర్లలోని 720 కోట్లను కార్వీ సంస్థ ఇతర సంస్థలకు మళ్లించిందని పోలీసులు చార్జిషీట్ లో పేర్కొన్నారు.
కస్టమర్ల షేర్లను....
కస్టమర్ల షేర్లను తమ షేర్లుగా చూపించి బ్యాంకుల నుంచి రుణాలను పొందినట్లు పోలీసులు కనుగొన్నారు. కార్వీ సంస్థ ఎండీ పార్థసారధిని ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన బెంగుళూరు జెలులో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతి పెద్ద మోసం గా పోలీసులు దీనిని ఛార్జిషీట్ లో పేర్కొనడం విశేషం.
Next Story