Fri Dec 05 2025 23:48:26 GMT+0000 (Coordinated Universal Time)
లోన్ ఇవ్వలేదని.. ఏకంగా బ్యాంకుకే నిప్పు పెట్టేశాడు !
కర్ణాటకలోని హవేరీ జిల్లాలో శనివారం (జనవరి 8) ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. రత్తిహళ్లి పట్టణంలో

లోన్ కావాలంటే బ్యాంక్ కు వెళ్లి వివరాలు తెలుసుకుని, అప్లై చేస్తాం. లోన్ రాకపోతే మన టైం బాలేదనుకుని వెళ్లిపోతాం. కానీ ఓ యువకుడు అలా సరిపెట్టుకోలేకపోయాడు. లోన్ ఇవ్వకపోవడంతో.. ఏకంగా ఆ బ్యాంకుకు నిప్పు పెట్టాడు. కర్ణాటకలో జరిగిందీ ఘటన. విషయం తెలుసుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని హవేరీ జిల్లాలో శనివారం (జనవరి 8) ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. రత్తిహళ్లి పట్టణంలో ఉండే వసీం హజారస్తాబ్ ముల్లా(33) అనే యువకుడు హెదుకొండ గ్రామంలో ఉన్న కెనరాబ్యాంకులో లోనుకు అప్లై చేసుకున్నాడు. అతను పొందుపరిచిన డాక్యుమెంట్లను పరిశీలించిన బ్యాంకు ఉద్యోగులు.. సిబిల్ స్కోరు తక్కువగా ఉందని బ్యాంకు అతనికి లోన్ ఇవ్వటం కుదరదు అని స్పష్టం చేశారు.
Also Read : వైద్య చరిత్రలో అద్భుతం.. మనిషికి పంది గుండె !
తనకు లోన్ ఇవ్వమని చెప్పడంతో.. ఆ బ్యాంకుపై కోపం పెంచుకున్నాడు వసీం. విచక్షణ మరిచిపోయి.. శనివారం రాత్రే బ్యాంకు కిటికీలు పగులగొట్టి.. లోపల పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. దాంతో బ్యాంకులోని ఐదు కంప్యూటర్లు, విలువైన డాక్యుమెంట్లు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదం కారణంగా రూ.12 లక్షల నష్టం సంభవించిందని బ్యాంకు ఉద్యోగులు చెప్తున్నారు. ఉద్యోగుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 246, 477, 435 కింద అతనిపై కేసులు నమోదు చేశారు.
Next Story

