Sat Mar 21 2026 07:24:09 GMT+0530 (India Standard Time)
బస్సు - లారీ ఢీ.. ఏడుగురు దుర్మరణం
మంగళవారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు - లారీ కర్ణాటకలోని హుబ్బళ్లి శివారులో ఢీ కొన్నాయి.

కర్ణాటక : బస్సు -లారీ ఢీ కొని ఏడుగురు దుర్మరణం చెందిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఈ ఘటనలో మరో 26 మంది గాయపడ్డారు. మంగళవారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు - లారీ కర్ణాటకలోని హుబ్బళ్లి శివారులో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 26 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
Next Story

