Thu Mar 19 2026 20:55:54 GMT+0530 (India Standard Time)
Telangana : ఎమ్మెల్యే ఇంట్లో విషాదం...భార్య బలవన్మరణం
కరీంనగర్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య బలవన్మరణానికి పాల్పడ్డారు.

కరీంనగర్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఎమ్మెల్యే ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి నిన్న సాయంత్రం బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్ లోని ఆల్వాల్ లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరి వేసుకుని మరణించారు. పోలీసుల కథనం మేరకు రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
కారణాలు తెలియకున్నా...
ఎమ్మెల్యేకు ఇద్దరు పిల్లలున్నారు. రూపాదేవి రెండు రోజుల నుంచి పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు ఎమ్మెల్యే నిన్న ఉదయం నియోజకవర్గం పర్యటనకు వెళ్లారు. సాయంత్రం తిరిగివచ్చే సరికి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించారు. రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కుటుంబమంతా తీర్థయాత్రలకు వెళ్లివచ్చారని బంధువులు చెబుతన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

