Fri Dec 05 2025 12:24:49 GMT+0000 (Coordinated Universal Time)
హకీంపేట దారుణం కలచివేసింది: కల్వకుంట్ల కవిత
తెలంగాణలో చోటు చేసుకున్న ఓ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెలంగాణలో చోటు చేసుకున్న ఓ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. "ఒక దినపత్రిక లో వచ్చిన కథనం నన్ను ఎంతో కలిచివేసింది. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదు. బాలిక పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలని, పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధితురాళ్లకు న్యాయం చేయాలని గౌరవ మంత్రి @VSrinivasGoud గారిని కోరుతున్నాను" అంటూ ఆదివారం ఉదయం ఒక పోస్టు పెట్టారు కవిత.
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో... అధికారి లైంగిక వేధింపులపై ఆమె ఈ విధంగా స్పందించారు. స్పోర్ట్స్ స్కూల్లో తన గదికి ఎదురుగా ఉండే గదిలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో సదరు అధికారి రాసనీలలు నడుపుతున్నాడని, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఆ అధికారి. బాలికలను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడు. సాయంత్రం సమయంలో ఆట విడుపు పేరుతో వికృతి చేష్టలకు దిగుతున్నాడు. ఆట విడుపు పేరుతో కారులో బాలికలను ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారిపై ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని బాలికలు ఆరోపించారు. ఉన్నతాధికారుల అండదండలతో వేధింపులకు పాల్పడుతున్నాడని బాలికలు చెబుతున్నారు. స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై స్పందించిన ప్రభుత్వం..బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారిని సస్పెండ్ చేసింది.
Next Story

