Fri Dec 05 2025 11:39:08 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ లో మరో విషాదం.. యువనటి దుర్మరణం
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. స్వగ్రామానికి వెళ్లిన జ్యోతి.. సోమవారం రాత్రి హైదరాబాద్ కు తిరుగుపయనమైంది. చిత్తూరు నుంచి

టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాద వశాత్తు యువనటి జ్యోతిరెడ్డి మృతి చెందింది. మంగళవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో జ్యోతిరెడ్డి అనే యువతి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా చిట్వేన్ మండలానికి చెందిన బట్టినపాత జ్యోతి హైదరాబాద్ లో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. సినిమాల్లోకి రావాలని ఆమె ఆకాంక్ష. ఉద్యోగం చేస్తూనే.. జూనియర్ ఆర్టిస్టుగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.
Also Read : భాగ్యనగరంలో మరో కేబుల్ బ్రిడ్జి.. రేపే ప్రారంభం
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. స్వగ్రామానికి వెళ్లిన జ్యోతి.. సోమవారం రాత్రి హైదరాబాద్ కు తిరుగుపయనమైంది. చిత్తూరు నుంచి కాచిగూడ వస్తోన్న వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో ఆమె రైల్వే కోడూరులో ఎక్కి హైదరాబాద్ కు బయల్దేరింది. మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ షాద్నగర్ రైల్వే స్టేషన్లో ఆగింది. నిద్రమత్తులో ఉన్న జ్యోతిరెడ్డి కాచిగూడ రైల్వేస్టేషన్ అనుకొని షాద్నగర్ స్టేషన్లో దిగింది. స్టేషన్ పేరు చూసి.. తిరిగి రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా.. అప్పటికే రైలు కదిలిపోయింది. దాంతో జ్యోతి ప్లాట్ ఫాంపై పడిపోయింది. ఆమె తలకు బలమైన గాయాలవ్వడంతో.. రైల్వే పోలీసులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు.
Next Story

