పుట్టపర్తి : అనంతపురం జిల్లా టిడిపి నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పుట్టపర్తికి వెళ్తున్న మరూర్ టోల్ గేట్ వద్ద పోలీసులు జేసీ ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. జేసీ పుట్టపర్తికి వెళ్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. కాగా.. తనను అరెస్ట్ చేయడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తారోనంటూ జేసీ మండిపడ్డారు. ఎవరు అడ్డుకున్నా పుట్టపర్తికి వెళ్లి తీరుతానని జేసీ తేల్చి చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్నానని, అంతమాత్రానికే నా వల్ల అక్కడ ఏదో జరుగుతుందని ఆపడం సమంజసం కాదన్నారు.
Thu May 19 2022 01:08:54 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్

Next Story