Sun Oct 06 2024 01:51:30 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్యకు మూడేళ్లు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి మూడేళ్లవుతుంది. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి మూడేళ్లవుతుంది. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగింది. పులివెందులలోని ఆయన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఈ హత్య మిస్టరీగా మారింది. 2019 సాధారణ ఎన్నికలకు ముందు ఈ హత్య జరగడంతో అప్పట్లో సంచలనమే అయింది. టీడీపీ అధికారంలో ఉండటంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేశారు.
సీబీఐ దర్యాప్తుతో....
జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మరో టీం ను విచారణ కోసం ఏర్పాటు చేశారు. అయితే హత్యకు గల కారణాలు, నిందితులు ఎవరో తెలియకపోవడంతో వివేకా కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తును కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.
రాజకీయంగా....
బెంగళూరులోని ఒక ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలోనే ఈ హత్య జరిగినట్లు సీబీఐ ఒక నిర్థారణకు వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. నిందితుడు దస్తగిరిని అప్రూవర్ గా మారాడు. అయితే ఇటీవల ఈ హత్య కేసు రాజకీయంగా అనేక మలుపులు తిరుగుతోంది. మొత్తం మీద వైఎస్ వివేకా హత్య జరిగి మూడేళ్లవుతున్నా హత్య విషయంలో ఇంకా ఒక స్పష్టత రాకపోవడం విశేషం.
Next Story