Mon Apr 29 2024 05:36:32 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : సీసీఎస్ పోలీసుల అదుపులో ఐపీఎస్ అధికారి
తెలంగాణలో ఐపీఎస్ అధికారి నవీన్‌కుమార్ ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు
తెలంగాణలో ఐపీఎస్ అధికారి నవీన్‌కుమార్ ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్‌లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై అరెస్ట్ చేశారు. మాజీ ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఇంట్లో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ నివాసముంటున్నారు. నవీన్ కుమార్ ప్రస్తుతం పోలీసు అకాడమీ ఎస్పీగా పనిచేస్తున్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ ఇంటిని కబ్జా చేయాలని...
భన్వర్ లాల్ ఇంట్లో ఉంటూ ఆ ఇంటికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లను సృష్టిించి కబ్జా చేయడానికి ప్రయత్నించారు. దీనిపై భన్వర్‌లాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు విచారణ జరిపి నవీన్ కుమార్ ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. బేగంపేటలో ఉన్న భన్వర్‌లాల్ నివాసాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఆయనను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story