Fri Sep 13 2024 14:14:19 GMT+0000 (Coordinated Universal Time)
ఏకే రావు మృతిపై మరో ట్విస్ట్
ప్రముఖ టాలీవుడ్ సింగర్ హరిణి తండ్రి ఏకే రావు హత్య కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన జేబులో దొరికిన లేఖ పోలీసు విచారణలో కీలకంగా మారింది. ఒక స్థల వివాదంలో ముగ్గురితో ఏకే రావుకు విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఏకేరావు వారితో ఘర్షణ పడ్డారని చెబుతున్నారు. ఈ స్థల వివాదమే ఏకేరావు మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
150 కోట్ల ఆస్తి వివాదమే....
సింగర్ హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం బెంగళూరులోని రైల్వే ట్రాక్ పై దొరికిన సంగతి తెలిసిందే. అయితే బెంగళూరులోని సిద్ధగుంట పాళి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదయిన కేసు వివరాల ప్రకారం 150 కోట్ల ఆస్తి వివాదం ఉందని తేలింది. నేడు ఏకే రావు మరణానికి సంబంధించి పోస్ట్ మార్టం నివేదిక రానుంది. ఇందులో ముగ్గురి పేర్లు ఏకే రావు పేర్కొన్నట్లు తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడానికే ఏకే రావు ఈ లేఖను రాసినట్లు తెలిసింది. లేఖను కూడా పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.
Next Story