Fri Dec 05 2025 07:13:08 GMT+0000 (Coordinated Universal Time)
Murder Case : చందు రాథోడ్ ను హత్య చేసింది అందుకేనా? వెలుగు చూసిన కొత్త కోణం
నిన్న మలక్ పేట్ లో జరిగిన చందు రాథోడ్ హత్య కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి

నిన్న మలక్ పేట్ లో జరిగిన చందు రాథోడ్ హత్య కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిన్న మలక్ పేట్ లోని శాలివాహన నగర్ లోని పార్కులో వాకింగ్ చేస్తుండగా దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. చందూరాథోడ్ అక్కడిక్కడే మరణించారు. మొత్తం ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపారు. అందులో ఐదు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంపాలన్న స్కెచ్ వేసి మరీ దుండగులు కాల్పులు జరిపారు. అయితే భూ వివాదాలుకూడా ఒక కారణం కాగా, మరొక కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
భూమిని కాజేశారంటూ...
చందు రాథోడ్ వారి స్థలంలో సీపీఎం నేతగా పేదల చేత గుడెసెలు వేయించి తమ ఆస్తిని కాజేసే ప్రయత్నం చేశారన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చందు రాథోడ్ హత్య కేసులో మొత్తం ఐదుగురు నిందితులు పాల్గొన్నారు. వీరంతా రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. కారును అద్దెకు తీసుకుని చందు రాధోడ్ నివాసం వద్ద రెండు రోజుల పాటు మకాం వేశారు. చందు రాధోడ్ రోజు వారీ కార్యక్రమాలను గురించి పక్కాగా తెలుసుకున్నారు. ప్రతిరోజూ ఉదయం వాకింగ్ కు చందు రాధోడ్ వెళతారని నిందితులు గమనించారు.
పక్కా ప్లాన్ వేసి...
శాలివాహన పార్కు వద్ద కాల్పులు జరిపి తాము ఎలా పరారు అవ్వాలన్న దానిపై కూడా ముందుగానే ప్లాన్ వేశారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి చందు రాధోడ్ కార్యక్రమాలను పరిశీలించిన తర్వాత మాత్రమే పక్కా ప్లాన్ తో దాడి చేసి కాల్పులు జరిపినట్లు పోలీసుల విచారణలో ప్రాధమికంగా వెల్లడయింది. దీంతో పాటు చందు రాధోడ్ కు సంబంధించిన మరో కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు కేవలం భూ తగాదాల వల్లనే హత్య చేశారా? వివాహేతర సంబంధం ఇందులో ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కాల్పుల కేసును సవాల్ గా తీసుకుని విచారణ చేపడుతున్నారు
Next Story

