Thu Jan 22 2026 07:17:23 GMT+0000 (Coordinated Universal Time)
పది కిలోమీటర్ల పోలీస్ ఛేజింగ్.. బోల్తాపడిన ఇన్నోవా కారు... అందులో కరెన్సీ కట్టలు
ఖమ్మం జిల్లా కూసుమంచి వద్ద ఇన్నోవా కారు బోల్తా పడింది. ఈ కారులో నుంచి కోటిన్నర నగదు బయటపడింది

ఖమ్మం జిల్లా కూసుమంచి వద్ద ఇన్నోవా కారు బోల్తా పడింది. ఈ కారులో నుంచి కోటిన్నర నగదు బయటపడింది. నాయకనగూడెం టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఒక ఇన్నోవా వచ్చి ఆగకుండా వెళ్లింది. ఆ ఇన్నోవా కారును దాదాపు పది కిలోమీటర్లను పోలీసులు ఛేజ్ చేశారు. అయితే పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో ఇన్నోవా కారు బోల్తా పడింది. అందులో ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కోటిన్నర నగదును...
ఇన్నోవా కారు నుంచి కోటిన్నర నగదు బయటపడింది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకే నగదును తీసుకెళతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారు వేగంగా వెళుతూ ఈ కారు బోల్తా పడటంతో నగదు బయటపడింది. ఈ నగదు ఎవరిది? ఎక్కడకు తీసుకెళుతున్నారు? ఎవరికి పంపిణీ చేయడానికి వెళుతున్నారు? అన్న దానిపై పోలీసులు దొరికిన నిందితులను విచారిస్తున్నారు.
Next Story

